అదరగొట్టేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమా డైరీ’లో మరో ఏడాది గడిచిపోయింది. ప్రతి ఏడాదిలో కొత్త ఉత్సాహంతో ఘన విజయాలు అందుకోవాలని అందరూ ఎంతో కొంత ప్రయత్నించినా- సక్సెస్‌లు అందచ్చు, అందకపోవచ్చు. 2016లో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి. అందాలతో, అభినయంతో ఆకట్టుకునేందుకు కొత్తతరం అమ్మాయిలు వస్తూనే ఉంటారు. టాలెంట్, గ్లామర్‌తో ఆకట్టుకోవడానికి వారు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. ఓ వైపు స్టార్ హీరోయిన్లను ఎదుర్కొని ప్రేక్షకులను ఆకట్టుకోవడమంటే మామూలు విషయం కాదు. దానికి కావలసిన గ్లామర్, గ్రామరూ అవసరమే. ఈ ఏడాది తెలుగు పరిశ్రమలోకి కొత్తగా పలువురు అందాల భామలు ఎంట్రీ ఇచ్చారు. ఒకరు గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే, మరొకరు టాలెంట్‌తో సత్తా చాటాలని భావించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ప్రేక్షకుల్ని ఆకట్టుకుని నిలదొక్కుకున్నప్పుడే వారి సత్తా ఏమిటో తెలిసేది. ఈ ఏడాది వచ్చిన హీరోయిన్లు ఎవరు ఎలా ఆకట్టుకొని అలరించారో చూద్దాం..
2016 ప్రారంభంలో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. చైల్డ్ ఆర్టిస్టుగా పలు మలయాళ చిత్రాల్లో నటించిన ఈమె, తనదైన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎక్కడా అశ్లీలతకు స్కోప్ ఇవ్వకుండా అభినయ ప్రతిభను చాటింది. నేను శైలజ చిత్రం సరికొత్త ప్రేమకథగా తెరకెక్కి అటు రామ్‌కి కూడా వరుస పరాజయాల తరువాత మంచి విజయాన్ని అందించింది. ఇందులో కీర్తి సురేష్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో కుర్రకారు హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పదిలం చేసుకున్న కీర్తి, ఆ తరువాత పలు అవకాశాలను కొట్టేసింది. అందం, అభినయం రెండూ కలగలసిన ఈ అమ్మడు ప్రస్తుతం నాని సరసన నేను లోకల్, విజయ్ సరసన భైరవ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి.
ఆ తరువాత లిస్టులో ఎంట్రీ ఇచ్చింది పల్లక్ లల్వాని. నాగశౌర్య హీరోగా నటించిన అబ్బాయితో అమ్మాయి చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈమెకు ఈ సినిమా పరాజయానే్న అందించింది. గ్లామర్‌తో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఈ ఏడాది తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నటి రకుల్‌ప్రీత్ సింగ్ మాత్రమే అని చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈమెకు ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లోవచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రంలో మంచి మార్కులు కొట్టేసింది.
ఈ సినిమాకు రకుల్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆ సినిమాతో మొదలుపెట్టిన ఆమె విజయపరంపర అనూహ్యంగా కొనసాగుతూ అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటించి మరో విజయాన్ని అందుకుంది. తాజాగా రామ్‌చరణ్ సరసన ధృవలో నటించి మరో సక్సెస్‌ను సాధించింది. ఈ ఏడాది పాపులరైన కథానాయికల్లో మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఒకరు. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సరసన అ ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సమంతతోపాటు రెండో కథానాయికగా పల్లెటూరి అమ్మాయిగా నాగవల్లి పాత్రలో అనుపమ నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు వచ్చాయి. దిల్‌రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’లో నటిస్తోంది. ప్రేమమ్ తెలుగు రీమేక్‌లో కూడా నటించి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇక, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మంజిమా మోహన్. భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంజిమ నటన అందరినీ ఆకట్టుకుంది. గ్లామర్‌తో కాకుండా నటనతో ఆకట్టుకున్న ఈమె టాలెంట్‌కు టాలీవుడ్ ఫిదా అయింది. దాంతో వరుస అవకాశాలు దక్కాయి.
ఇక ఈ లిస్టులో చెప్పుకోవలసింది నివేదా థామస్. నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్‌మాన్ చిత్రంతో తెలుగులోకి వచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఈ చిత్రంలో నివేద నటన ప్లస్‌గా నిలిచింది. సినిమా విజయంలో నివేదా టాలెంట్ కీలకం కావడంతోపాటు ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. నటనతో ఆకట్టుకుంటున్న నివేద ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమెకు పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నిఖిల్ సరసన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన నందితా శే్వత కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. చాలా రోజులనుండే పరిశ్రమలో ప్రయత్నిస్తున్న ఈ భామకు దొరికిన మంచి అవకాశం ఇది. ఈ చిత్రంలో నందిత శే్వత ఇచ్చిన హావభావాలు ప్రేక్షకులను కదిలించాయి. అందానికి నటనకు మంచి మార్కులే ఇచ్చారు ప్రేక్షకులు. ఈ సినిమాతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది నందిత. నాని హీరోయిన్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాధ చిత్రంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ కౌర్. భిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రియురాలి పాత్రలో ఆమె నటించిన తీరుకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదే కాంబినేషన్‌లో నాని, హను రాఘవపూడిల కాంబినేషన్‌లో వచ్చిన మజ్ను చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. కమర్షియల్‌గా సినిమా విజయం ఎలా వున్నా ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది అను. ఈ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారి ప్రస్తుతం బిజీగా వుంది. ఈ లిస్టులో మరికొందరు హీరోయిన్లు ఫెయిల్ మార్కులు తెచ్చుకుని వెనుకబడిపోయారు. అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా టాలెంట్‌తోపాటు అదృష్టం కలిసిరావాలనేలా ఉంది పరిస్థితి. ఈ ఏడాదిలో రాజ్‌తరుణ్ సరసన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రంలో నటించిన ఆర్తన, లజ్జ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మధుమిత, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన స్పీడున్నోడు చిత్రంతో పరిచయమైన సోనారికా బడోరియా, ‘మెగా’ కుటుంబం వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నీహారిక (ఒక మనసు) ఆకట్టుకోలేకపోయారు.
కొత్త హీరోయిన్ల మాట ఎలా వున్నా స్టార్ హీరోయిన్లుగా తెలుగులో ఇమేజ్ తెచ్చుకుని దూసుకుపోతున్న గ్లామర్ భామలు ఈ ఏడాదిలో ఎలాంటి విజయాలని అందుకొన్నారో చూద్దాం. ఈ లిస్టులో ముందు వరుసలో వుంది సమంత. ఆమెకు 2016 మర్చిపోలేని సంవత్సరం. వరుస అవకాశాలతో, మంచి విజయాలతో తన డైరీని పూర్తిచేసింది. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’తో మరో మెట్టెక్కింది సమంత. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘24’ చిత్రంలో కూడా ఆకట్టుకుంది. ఈమె తరువాత అదే క్రేజ్‌లో నిలిచింది కాజల్. ఈ ఏడాది కాజల్‌కు పెద్దగా విజయాలేమీ లేవు కానీ, వరుస అవకాశాలతో జోరుమీదుంది. ఈ ఏడాది కాజల్ నటించిన మహేష్ బ్రహ్మోత్సవం, పవన్‌కళ్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాలు పరాజయాన్ని అందించాయి. ఆ తరువాత ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో ప్రత్యేక పాట చేసి షాకిచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన ఖైదీ నెం.150 చిత్రంలో నటిస్తోంది. గ్లామర్ భామగా సౌత్‌లో క్రేజ్ తెచ్చుకున్న తమన్నాకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల్ని భయపెట్టాలని చేసిన అభినేత్రి భారీ పరాజయాన్ని అందించింది. అడపాదడపా నటించిన సినిమాలు కూడా కమర్షియల్‌గా సరైన విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది నాగార్జున-కార్తిల కలయికలో వచ్చిన ‘ఊపిరి’ చిత్రం ఒక్కటే ఈమె ఖాతాలో చెప్పుకోదగ్గదిగా నిలిచింది.

-శ్రీ