నేనూ రౌడీనే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తమిళంలో విజయవంతమైన నానమ్ రౌడీదామ్ చిత్రాన్ని తెలుగులో నేనూ రౌడీగా అనువదిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన తారాగణంగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన, రమేష్ అన్నంరెడ్డి అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని చక్కగా అనువాదం చేస్తున్నామని, డబ్బింగ్ పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు. తమిళంలో ధనుష్ రూపొందించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించిందని, పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయని వారు తెలిపారు. నయనతార నటన హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం ఆమెకు అనేక అవార్డులను తెచ్చిపెడుతుందని, త్వరలోనే ఈ సినిమాను అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. పార్తీబన్, రాధిక, బాలాజి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా:జార్జి సి.విలియమ్స్, ఎడిటింగ్:శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు:కోనేరు కల్పన, రమేష్ అన్నంరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:విఘ్నేశ్ శివన్.