శంకర్ పెళ్లి.. జరగాలి మళ్లీమళ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జబర్దస్త్’ కామెడీ బృందంలో గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్, వెండి తెరపై కూడా అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన చిత్రాలలో షకలక శంకర్‌కు మంచి పాత్రలు దొరికాయి. అవి ప్రేక్షకుల ఆదరణ కూడా పొందాయి. తాజాగా శంకర్ కథానాయకుడుగా నటించనున్నాడు. సింహ ఫిలిమ్స్ పతాకంపై గంటా రామకృష్ణనాయుడు దర్శకత్వంలో జి.అనీల్‌కుమార్ ఓ సినిమాని రూపొందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్లీమళ్లీ’ అన్న పేరును ఖరారు చేశారు. ఈ నెల 5న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభిస్తున్నామని నిర్మాత తెలియజేశారు.