వెనె్నల దర్శకుడితో శర్వానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి కమర్షియల్ హిట్ తరువాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ దిల్‌రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2017 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ప్రస్తుతం శర్వానంద్ ఒక కొత్త సినిమాకి ఓకే చెప్పాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ కెరీర్‌లోనే మంచి సినిమాగా నిలిచిన ‘ప్రస్థానం’ను డైరెక్ట్‌చేసిన దర్శకుడు దేవకట్ట డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండనుందట. ‘వెనె్నల, ప్రస్థానం’వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దేవకట్ట నాగచైతన్యతో తీసిన ‘ఆటోనగర్ సూర్య’ పరాజయంతో బాగా వెనుకబడ్డాడు. 2014 విడుదలైన ఈ సినిమా తరువాత దేవకట్టకు యంగ్ హీరోలవద్ద ఛాన్సులు కరువయ్యాయి. దీంతో ఆయన చాలాకాలం వెయిట్‌చేసి చివరికి తన హిట్ కాంబినేషన్ శర్వానంద్‌తోనే సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. అయితే ఇంకా అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.