12న శాతకర్ణి దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణిగా నటిస్తున్న చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్ఠాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు శాతకర్ణి జీవితం ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచంలోని తెలుగువారందర్నీ ఆకట్టుకుంటుందని, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించిందని, అలాగే చిరంతన్‌భట్ రూపొందించిన బాణీలు సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తున్నాయని తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నేడు సంక్రాంతి సినిమాగా సగర్వంగా ఈ చిత్రాన్ని 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, మొరాకో, మధ్యప్రదేశ్‌లలో చిత్రీకరించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైలెట్‌గా ఉంటుందని, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయని వారు తెలిపారు. శాతకర్ణి ఘనకీర్తిని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని వారన్నారు. శ్రేయ, కబీర్‌బేడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్‌భట్, పాటలు: సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, దర్శకత్వం: క్రిష్.
శాతకర్ణికి వినోదపు పన్ను రాయితీ
నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేసిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన రాజు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమా భారతీయ సంస్కృతిని, శాతకర్ణి గొప్పదనాన్ని ప్రజలకు తెలిపేలా ఉండనుందని, ఇలాంటి చిత్రాలు తప్పక రావాలని ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసిఆర్ పలు సందర్భాల్లో కొనియాడారు. అంతేగాక చరిత్ర ప్రకారం తెలంగాణాలోని కోటిలింగాలు శాతవాహన సామ్రాజ్య సింహద్వారంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతకర్ణి దేశాన్ని పాలించాడు. ఆయనతో అంత గొప్ప అనుబంధం ఉంది కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాకి పూర్తి వినోద పన్ను రాయితీని కల్పించారు. ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది.