7న హాయ్‌లాండ్‌లో ‘మెగా’ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ ముందస్తు విడుదల వేడుకను గుంటూరు జిల్లా చిన్నకాకాని వద్ద హాయ్‌లాండ్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఈనెల 7న సాయంత్రం ‘బాస్ ఈజ్ బాక్’ పేరుతో జరిగే ఈ వేడుకలో దాదాపు 5వేల మంది అభిమానులు వస్తున్నారని, చిరంజీవి కుటుంబ సభ్యులంతా హాజరవుతారని, పవన్‌కళ్యాణ్ అందుబాటులో వుంటే తప్పక వస్తారని అన్నారు. ఈనెల 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత రామ్‌చరణ్ తెలిపారు. మొదట ఈ సినిమాను 12న విడుదల చేయాలనుకున్నామని, అయితే అదే రోజు మరో అగ్రహీరో సినిమా విడుదల కానున్నందున తాము ఒక రోజు ముందుగా విడుదల చేస్తున్నామన్నారు. అనుమతి విషయంలో తలెత్తిన సమస్య కారణంగా ఈనెల 4న జరగాల్సిన వేడుకను 7వ తేదీన హాయ్‌లాండ్‌లో నిర్వహిస్తామని తెలిపారు.