భయపెట్టే కేశవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు సినిమాపై నెలకొన్నాయని, అందుకు నిదర్శనంగా పంపిణీదారులు ముందుకు వస్తున్నారని నిర్మాత అన్నారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథనంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టేలా సాగుతుందని, హారర్ ఎంటర్‌టైనర్ కాకపోయినా వైవిధ్యంగా చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేశామని, స్వామిరారా సినిమాలాగే ఈ చిత్రం కూడా ఓ ట్రెండ్ సృష్టిస్తుందని అన్నారు. రీతూవర్మ, ఇషాకొప్పీకర్, రావురమేష్, అజయ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:దివాకర్ ముని, సంగీతం:సన్ని.ఎం.ఆర్., నిర్మాత:అభిషేక్ నామా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుధీర్ వర్మ.