హీరోగా ఎదిగిన షకలక శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహ ఫిలింస్ పతాకంపై షకలక శంకర్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో గంటా రామకృష్ణ నాయుడు దర్శకత్వంలో అనిల్‌కుమార్.జి నిర్మిస్తున్న చిత్రం ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో షకలక శంకర్, పోసాని కృష్ణమురళి, నిర్మాత అనిల్‌కుమార్, దర్శకుడు గంటా రామకృష్ణ నాయుడు, నటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ‘రాజుగారి గది’లో వలే ఈ చిత్రంలో ఎక్కువ నిడివి వున్న పాత్రలో చేస్తున్నానని, తండ్రిగా పోసాని నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి పోసాని నిజమైన హీరో అని, ఈ చిత్రం కామెడీతో, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అలరిస్తుందన్నారు.
పోసాని మాట్లాడుతూ, తండ్రిగా ఎన్నో చిత్రాల్లో చేశానని, ఈ చిత్రంలో విభిన్నమైన తండ్రి పాత్రలో కనిపిస్తానని అన్నారు. కొడుకుగా షకలక శంకర్ నటిస్తున్నాడని, తమ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుందని, కంటతడి కూడా పెట్టిస్తుందన్నారు.
దర్శకుడు గంటా రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ, ఈ సినిమా నవ్విస్తూనే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అన్నారు. నిర్మాత అనిల్‌కుమార్.జి మాట్లాడుతూ, ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:కల్పన, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, కొరియోగ్రఫి:సుచిత్ర చంద్రబోస్, కెమెరా:ఎస్.రాజశేఖర్, పిఆర్‌ఓ:బి.వీరబాబు, పబ్లిసిటీ డిజైనర్:వివ పోస్టర్స్, ప్రొడక్షన్ కంట్రోలర్:సిహెచ్.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:బి.రవీంద్రారెడ్డి, నిర్మాత:అనిల్‌కుమార్.జి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గంటా రామకృష్ణ నాయుడు.