అడవిలో వజ్రాలవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్, అడ్వెంచరస్, హారర్ కథాంశంతో ‘వజ్రాలవేట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిరణ్, సుమి, గిడ్డేష్, సమీరా ప్రధాన పాత్రధారులు. శేఖర్ చంద్ర దర్శకత్వంలో కె.ఎస్.ఎల్.్ఫలింస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కరె శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయందని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- మహానంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలులో హీరోలు, విలన్లమధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరించామన్నారు. 70 మందిపైన ఛేజింగ్స్ ఎపిసోడ్స్‌ను డబుల్ కెమెరాతో షూట్ చేశామని, విలన్ బ్యాచ్‌ను ఆట పట్టించడంతోపాటు కొన్ని సరదా సన్నివేశాలను తీశామని వివరించారు. ఇక చిత్ర కథాంశం ఆయన వివరిస్తూ, ఒకేసారి వేల కోట్లు సంపాదిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఈ చిత్రంలోని హీరో హీరోయిన్లు, విలన్లకు కలుగుతుంది. వాటిని సాధించడానికి వారు అడవికి వెళ్లిన నేపథ్యంలో జరిగే పరిణామాలతో కథ సాగుతుందని తెలిపారు. ఈ చిత్రంలో వినోద్‌కుమార్, శివ ఫేమ్ శివసత్యనారాయణ, హుస్సేన్, మహేశ్వరాచారి, నందిని తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా:బి.వి.రావు, నిర్మాత:కరె శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శేఖర్ చంద్ర.