విశాల్ సరసన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ ఆండ్రియా అడపా దడపా సినిమాల్లో కనిపించినా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ సత్తా చాటుకుంటోంది. విశ్వరూపం, ఉత్తమవిలన్ తదితర చిత్రాల్లో నటించిన ఈమెకు తాజాగా విశాల్ సరసన నటించే ఛాన్స్ దక్కింది. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే తుప్పరివాలన్ చిత్రంలో కీలకపాత్ర కోసం ఆండ్రియాను ఎంపిక చేశారట. విశాల్, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా పాత్రకోసం మొదట అక్షర హాసన్‌ను అనుకున్నారు. కానీ, కమల్‌హాసన్ రూపొందిస్తున్న సినిమా పనుల్లో అక్షర బిజీగా వుంది. కాల్‌షీట్లు కుదరకపోవడంతో ఆమె స్థానంలో ఆండ్రియాని ఎంపిక చేశారు. ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆండ్రియా కనిపిస్తుందని, ఆమె కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్‌ని ఇస్తుందని అంటున్నారు. ఈనెలాఖరు నుండి షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ది హౌజ్ నెక్స్ట్‌డోర్, తారామణి, వడాచెన్నయ్ చిత్రాల్లో నటిస్తోంది ఆండ్రియా.