మండుతున్న సూర్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్య, హన్సిక జంటగా శ్రీ సూర్యసాకేత్ పిక్చర్స్, సర్వల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మగిళ్ తిరుమేను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మండే సూర్యుడు’. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. తమిళంలో విజయవంతమైన మీగామాన్ సినిమాను అనువదించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆర్య స్టయిలిష్ అండర్ కవర్ ఆఫీసర్‌గా నటించారని తెలిపారు.
గ్లామర్‌తోపాటు అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలో హన్సిక పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, ఇండియన్ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ ఎలా వుంటుంది? వారి పథకాలు ఏ స్థాయిలో ఉంటాయనే అంశాలను దర్శకుడు సరికొత్తగా వెండితెరపై ఆవిష్కరించారని తెలిపారు. ఏడుగురు విలన్లతో సాగే ట్రాక్‌లో హీరో ఆర్య ఎలా నటించాడన్నది వైవిధ్యంగా ఉంటుందని తెలిపారు. అషుతోష్ రాణా, సుధాంషుపాండే, రమణ, ఆశిష్ విద్యార్థి, అనుపమాకుమార్, మహదేవన్, హరీష్ ఉత్తమన్, అవినాష్, శరణ్య, సుబ్బయ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, మాటలు: వెంకట్ మల్లూరి, పాటలు: వెనె్నలకంటి, భువనచంద్ర, దర్శకత్వం: మగిళ్ తిరుమేని.