ఓ బాధ్యతగా భావించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు వినాయక్. ఆయన సినిమాలంటే మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ తన 150వ చిత్రంగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువ హీరో రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు వినాయక్ చెప్పిన విశేషాలు...
నమ్మకంతో ఉన్నాం...
సినిమా అవుట్‌పుట్ చూశాక హిట్ అవుతుందన్న నమ్మకం కలిగింది. చిరంజీవి 150వ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నిర్మాణం విషయంలో చాలా కేర్ తీసుకున్నాం.
‘చిరు’కు తగ్గట్టుగా..
తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే కథలో ఎలాంటి మార్పులు ఉండవు. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను రూపొందించాం. కామెడీ, మాస్ అంశాలు యాడ్ చేశాం.
మొదట్లో టెన్షన్ ..
మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా.. పైగా ప్రతిష్ఠాత్మకంగా ఉండే 150వ సినిమాకు దర్శకుడిగా నా పేరు చెప్పినపుడు టెన్షన్ అనిపించింది. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న తరువాత కాన్ఫిడెంట్‌తో పనిచేసి నా టెన్షన్‌ను బాధ్యతగా మార్చుకున్నా.
హైలైట్స్ చాలా..
మంచి కథ, మెగాస్టార్ చరిష్మాతోపాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫి అద్భుతంగా ఉంటుంది. పక్కా కమర్షియల్ హంగులతో ఉండే ఈ సినిమా ఫాన్స్‌కు పండుగే అని చెప్పాలి. ఇప్పటికే ఆడియో సూపర్‌హిట్ అయింది. మెగాస్టార్ డాన్సులు కలిస్తే ఇంక ఎలా ఉంటుందో చెప్పాలా..?
తరువాతి ప్రాజెక్టు..
తరువాతి సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. మంచి కథ వస్తే దాన్ని బట్టి ప్లాన్ చేస్తా.

-యు