లక్కున్నోడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు, హన్సిక జంటగా ఎం.వి.వి సినిమా పతాకంపై రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘లక్కున్నోడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేసిన అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ, తాను ఢీ సినిమా చూసినపుడు ఎలా ఫీలయ్యానో ఈ సినిమా చూసేటప్పుడు అలానే ఫీలయ్యానని తెలిపారు. అనేక ట్విస్టులతో సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, విష్ణు చక్కగా నటించారని తెలిపారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల చేస్తున్నామన్నారు. రచయిత రత్నబాబు మంచి కథను ఇచ్చారని, లక్కున్నోడిగానే తాను భావించుకుంటానని మంచు విష్ణు అన్నారు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి ఎమోషన్ సన్నివేశాలు ఉన్నాయని, తన జీవితంలో జరిగిన ఓ కథని ఈ సినిమా కోసం రాసుకున్నానని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని దర్శకుడు రాజ్‌కిరణ్ అన్నారు. తండ్రీకొడుకులమధ్య ఎమోషన్ అందరికీ నచ్చుతుందని నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ అన్నారు. 64 రోజులలో ఈ సినిమా పూర్తిచేశామని, విష్ణు లవ్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తాడని అన్నారు. కార్యక్రమంలో జి.నాగేశ్వర్‌రెడ్డి, కోవ వెంకట్, పి.జి.విందా, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, సంజయ్‌రెడ్డి, సత్యం రాజేష్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. తనికెళ్ల భరణి, వెనె్నల కిశోర్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అచ్చు ప్రవీణ్‌రాజ్, నిర్మాత:ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం:రాజ్‌కిరణ్.