ఎంతవరకు ఈ ప్రేమ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, కాజల్ జంటగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.కె.దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. తమిళంలో విజయవంతమైన కవలై వేండాం చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ, యువతరం మెచ్చే వైవిధ్యమైన కథాకథనాలతో లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తమిళంలో విజయవంతమైందని, తెలుగులో స్ట్రయిట్ సినిమాలా రూపొందించామని తెలిపారు. ‘రంగం’ హిట్ తర్వాత జీవా మరో మంచి పాత్రలో నటించాడని, పాటలకు, సంగీతానికి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. కాజల్ రొమాన్స్, కామెడీ, బోట్ కామెడీ సీన్స్ హైలైట్‌గా ఉన్నాయని అన్నారు. అభినందన్ కెమెరా పనితనం ఈ సినిమాలో సరికొత్తగా ఉంటుందని వివరించారు. బాబి సింహ, శృతిరామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, కెమెరా: అభినందన్ రామానుజమ్, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డి.కె.