రాఖీ.. పెళ్లి చేసుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఆమె సన్నిహితురాలు హాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ కోరుకుంటోందట. రాఖీ చాలా కష్టపడి పైకి వచ్చిందని, ఆమె రాళ్ళలో ప్రవహిస్తున్న నదిలాంటిదని, ఆమె ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోదని, అమ్మాయిలంతా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని హయత్ అంటోంది. రాఖీ లాంటి స్నేహితురాలు దొరకడం తన అదృష్టమని సోఫియా అంటోంది. ఆమె ఈ ఏడాదైనా పెళ్లిచేసుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పింది. ఆమెకు మంచి సంబంధం కోసం వెతుకుతున్నట్టు వివరించింది. రాఖీని ఎవరు సరిగా అర్థం చేసుకోలేదని, అందుకే ఆమెను ఒక ఐటెం గర్ల్‌గానే చూస్తున్నారని, ఆమె రుషిలాంటి మనిషని సోఫియా ఆకాశానికి ఎత్తేసింది. కొనే్నళ్ల పాటు బాలీవుడ్‌ను తన అందచందాలతో ఊపేసిన రాఖీ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ఆమధ్య ‘రాఖీ కా స్వయంవర్’ అనే రియాలిటీ షో నిర్వహించి అందులో ఈలేష్ పరిజన్‌వాలా అనే వ్యక్తిని ఎన్నుకుంది. కానీ, ఆ తరువాత కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు.