లవ్‌స్టోరీతో నేను లోకల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు రాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో నానిని కొత్తగా చూస్తారని, త్రినాథ్ తనదైన స్టైల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఎనర్జీ వున్న హీరో పాత్రను సృష్టించాడని, ఆ పాత్రతోనే వైవిధ్యమైన ప్రేమకథతో ఈ సినిమా రూపొందిందని, ఆడియో విడుదల కార్యక్రమం కాకినాడలో శనివారం జరుపుతున్నామని తెలిపారు. నాని కెరీర్‌లోనే వైవిధ్యమైన సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం వుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:నిజార్ షఫి, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:ప్రసన్నకుమార్ బెజవాడ, రచన:సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:త్రినాథరావు నక్కిన, నిర్మాత:శిరీష్.