రాయబారిగా చరణ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృవ సినిమాతో హిట్ అందుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన తర్వాతి సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి తరువాత మొదలు కానుంది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటికే ఇద్దరు దర్శకులు లైన్‌లో పెట్టాడు చరణ్. అందులో ఒకరు కొరటాల శివ, మరో దర్శకుడు మణిరత్నం. ఈ ఇద్దరు కాకుండా ఇప్పుడు మరో దర్శకుడు కూడా లైన్‌లోకి వచ్చేశాడు ఆయనే- నందమూరి బాలకృష్ణతో భారీ చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తీసిన దర్శకుడు క్రిష్! ఇప్పటికే చరణ్‌తో క్రిష్ కథాచర్చలు జరిపినట్టు తెలిసింది. ఆమధ్య వరుణ్ తేజ్‌తో రాయబారి చిత్రాన్ని తీయాలనుకున్నాడు క్రిష్. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోవడంతో ఇప్పుడు అదే ప్రాజెక్టుతో చరణ్‌తో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడేయ్య అవకాశాలు ఉన్నాయి.