కథే ప్రధానంగా త్రయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీ పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై గౌతమ్ నాయుడు దర్శకత్వంలో విష్ణురెడ్డి, అభిరామ్, సంజన ప్రధాన తారాగణంగా పద్మజానాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘త్రయం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ, సినిమాలో కథే ప్రధానంగా వుంటుందని, నిరంతరం శ్రమించి సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నించే కథానాయకుడి స్టోరీ ప్రేక్షకులకు నచ్చుతుందని, త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించామని, కథకు తగిన విధంగానే ఈ పేరును నిర్ణయించామని ఆయన అన్నారు. హీరో కొత్తవాడైనా శ్రమ తీసుకుని ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ వున్న ఫైటర్‌గా నటించాడని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపొందిందని నిర్మాత తెలిపారు. పాటలన్నీ సన్నివేశాలకు తగిన విధంగా వస్తాయని, పాటల చిత్రీకరించిన లొకేషన్లు హైలెట్‌గా వుంటాయని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:రుషి, కెమెరా:శివారెడ్డి, ఎడిటింగ్:రామారావు.జె.పి., స్క్రీన్‌ప్లే, మాటలు:సుదర్శన్ కర్మాల, నిర్మాత:పద్మజా నాయుడు, దర్శకత్వం:గౌతమ్ నాయుడు.