ఐటెం సాంగ్‌కు అడ్డులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదేళ్ల విరామం తరువాత చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖైదీ నెం.150’లో కథానాయికగా మెప్పించిన కాజల్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మనోభావాలు ఇలా..
రెస్పాన్స్ బాగుంది..
చిరంజీవి వంటి లెజండ్‌తో నటించడం గర్వంగా భావిస్తున్నాను. సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. చిరంజీవి హంబుల్, గ్రేసియస్ యాక్టర్. నేను పనిచేసిన హీరోల్లో స్వీట్ పర్సన్. పెద్ద స్టారైనా డౌన్ టు ఎర్త్‌గా వుంటారు.
అలా చెప్పడం కష్టం..
మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో నటించాను. వీరిలో ఎవరు బెస్ట్ అని అంటే చెప్పడం చాలా కష్టం. అయితే వీరందరిలో చిరంజీవి నా ఫేవరెట్. సినిమాలో చేసిన పాత్ర చిన్నదే అయినా చిరంజీవితో నటించడం కోసమే ఒప్పుకున్నాను.
డాన్స్‌లపై కృషి
చిరంజీవి గొప్ప డాన్సర్. డాన్స్‌పరంగా నాకు కావలసినంత టైమ్ కలిసి రావడంతో బాగా ప్రాక్టీస్ చేశాను. డాన్స్ చేసే సమయంలో ఆయన సలహాలు పాటించాను. ఆయనతో డాన్స్ చేయడం, నటించడం ఓ మంచి అనుభవాన్నిచ్చింది. చిరంజీవి, చరణ్‌తో కలిసి నృత్యం చేయడం కూడా ఓ మంచి మూమెంట్. చరణ్ ఇప్పుడు నిర్మాతగా మారినా, అతనిలో ఏ మార్పూ లేదు. ఖైదీ నెం.150 నిర్మాతగా చరణ్‌కు మొదటి సినిమా కాబట్టి నేను కూడా ఉద్వేగంగానే నటించాను. ఫ్రెండ్లీ హీరోగా ఉన్నా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.
స్పెషల్ సాంగ్స్
స్పెషల్ సాంగ్స్ చేయడంలో నాకు ప్రత్యేకమైన ఆలోచన ఏదీ లేదు. స్టార్స్ సినిమాల్లో చేస్తాను. లేకపోతే చేయను అని కూడా లేదు. మంచి ఆఫర్ వస్తే ఆలోచిస్తాను.
పెళ్లి ఎప్పుడంటే..
ఎక్కడికి వెళ్లినా ‘పెళ్లెప్పుడు?’ అని అడుగుతున్నారు. బాయ్‌ఫ్రెండ్స్ వున్నారని అడిగినా అందం. నాకలాంటివారు ఎవరూ లేరు. పెళ్లి సమయం ఇంకా రాలేదనుకుంటా. వస్తే.. ఇంట్లోవాళ్లు చెప్పిన వ్యక్తినే చేసుకుంటా.
తరువాతి చిత్రాలు
రానాతో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. అజిత్ హీరోగా మరో సినిమాలో, విజయ్ హీరోగా ఇంకో చిత్రంలో నటిస్తున్నా.

-యు