సుడిగాలిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై చిట్టిపల్లి లక్ష్మి సమర్పణలో వెంకటేష్, మల్లేశ్, ప్రాచీ అధికారి, మమతా కులకర్ణి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘సుడిగాలి’. షూటింగ్ పూర్తికావస్తున్న సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, నేటి యువత ప్రేమించడానికే తాము పుట్టామన్న ఆలోచనతో ఎక్కడపడితే అక్కడ జంటలు జంటలుగా దర్శనమిస్తూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, అలాంటివారికి చెంపపెట్టుగా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. అలాంటి జంటలను బహిరంగంగా చూసిన కొన్ని ఆత్మలు వారిని ఆవహించి ఎలాంటి ఇబ్బందులు పెట్టాయనే కథనంతో చిత్రం రూపొందించామని, ఫిబ్రవరిలో ఆడియోను, మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ప్రతి యువతీ యువకుడు సంఘంపై తమ బాధ్యతను కలిగివుండేలా ఈ చిత్రం సందేశం ఇస్తుందని తెలిపారు. నరసింహ, సుహాసిని, అశోక్‌వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:శ్రీను, సంగీతం:రాప్ రాక్ షకీల్, ఎడిటింగ్:శ్రీశైలం, సమర్పణ:చిట్టిపల్లి లక్ష్మి, కథ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం:రమేష్ అంకం.