వేశ్య పాత్రలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా దక్కని క్రేజ్‌ను రజనీకాంత్ కబాలి చిత్రంతో దక్కించుకుంది అందాల భామ ధన్సిక. కబాలిలో రజనీకాంత్ కూతురిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈమెకు పలు అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ హీరోయిన్‌గా ఓవైపు నటిస్తూనే, మరోవైపు భిన్నమైన పాత్రలు చేయడానికి సిద్ధమైంది. తాజాగా వేశ్యపాత్రలో నటించేందుకు ఓకె చెప్పిందట. ఈమధ్య సినిమా హీరోయిన్లకు వేశ్యపాత్రలంటే అమితాసక్తి. దానికి కారణం, ఆ పాత్రలో నటించేందుకు స్కోప్ వుండడమే కాకుండా నవరసాలు పలికించగల పాత్ర కావడం, ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఈ పాత్ర పట్ల సానుభూతి ఉండడంతో తొందరగా గుర్తింపు తెచ్చుకుంటారు. అందుకే స్టార్ హీరోయిన్లు సైతం ఈ తరహా పాత్రలనే ఎంపిక చేసుకునేందుకు ముందుంటారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది ధన్సిక. అయితే వేశ్య పాత్రలో నటిస్తోంది సినిమాలో కాదు? ఓ షార్ట్ ఫిలిం కోసమట. సీనమ్ పేరుతో రూపొందే ఈ చిత్రంలో ఓ వేశ్యకు, డాక్యుమెంటరీ మేకర్‌కు మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రమని, పాత్ర బాగా నచ్చడంతో ఓకె చెప్పిందట. ఈ పాత్రతో ఈమె ఎలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి!