షరతులు వర్తిస్తాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో సంచలన తారగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఈమధ్య కేవలం కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అటు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ప్రయోగాత్మక సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే డోరా సినిమాలో నటిస్తున్న నయన, మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టింది. ఈ విషయం పక్కనపెడితే, తాజాగా నయనతార దగ్గరికి దర్శక నిర్మాతలు వెళ్లడానికి జడుసుకుంటున్నారట. దానికి కారణం ఆమె పెడుతున్న షరతులు విని షాక్ అవుతున్నారట. ఇంతకీ నయనతార పెడుతున్న కండిషన్లు ఏమిటో తెలుసా? తన దగ్గరికి కథలు తీసుకువచ్చే దర్శక నిర్మాతలు కథలో ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్‌లాక్ సన్నివేశాలు, బాత్‌రూమ్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు ఉండొద్దని చెబుతోందట. అలా అయితేనే కథలు చెప్పండని తెగేసి చెబుతోందట. ఆమె ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందని కోలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఈ అమ్మడు తాజాగా విక్రమ్ సరసన నటించిన ఇరుమగన్ చిత్రంలో ఈ తరహా సన్నివేశాలు చేసిందట. సెన్సార్ సమస్యల వల్ల ఆ సన్నివేశాల్ని తొలగించారట. అంత కష్టపడి చేసిన సన్నివేశాలని తొలగిస్తారు కాబట్టి ఇక చేయడమెందుకని అంటోందట. మొత్తానికి నయనతార వ్యవహారం తేడాగా వుందని వార్తలొస్తున్నాయి.