సెన్సార్‌లో నటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవదీప్, కావ్యాశెట్టి జంటగా ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న చిత్రం ‘నటుడు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం నటుడిగా నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. నిర్మాత రమేష్‌బాబు మాట్లాడుతూ- ‘మానవ సంబంధాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ వస్తోంది. కథను విభిన్నంగా ట్రీట్‌మెంట్ చేసిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. కొత్తదనమున్న కథనంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. సస్పెన్స్‌తోపాటు ఆడియన్స్‌ను థ్రిల్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ, మానవ సంబంధాలతో వ్యాపారం చేసే ఓ కుర్రాడి కథే ఇది. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వుంటుంది. ప్రేమల్ని అమ్మడం అనే కొత్త కానె్సప్ట్‌తో తెరకెక్కిన సినిమాకు నవదీప్ ప్రాణం పెట్టి చేశాడు. కచ్చితంగా ఆయనకు మంచి బ్రేక్‌నిస్తుంది’అన్నారు.