మెగా @ 151

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల విరామం అనంతరం తాజాగా 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో మళ్లీ మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. పది రోజుల్లో 100 కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేశాక జోరు మీదున్న చిరు ఇపుడు తన 151వ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఆయన కొత్త చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌చరణ్‌తో ధృవ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న సురేందర్‌రెడ్డి ఇప్పుడు చిరంజీవి కోసం కథను సిద్ధం చేశాడు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచనా సహకారం అందిస్తున్నారట. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా మెగా తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తుండడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి.