క్రేజీ కాంబినేషన్‌లో మరో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. తుపాకీ, కత్తి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చినవే. ఈ రెండు సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఈ క్రేజీ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయంపై కనే్నసినట్లు తెలుస్తోంది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. విజయ్ ప్రస్తుతం తన 61వ చిత్రం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత మురుగదాస్‌తో చిత్రాన్ని విజయ్ ప్రారంభించనున్నాడు. ఈ ఏడాదే ఈ చిత్రం ప్రారంభం కానుంది. మురుగదాస్ ప్రస్తుతం మహేష్‌బాబుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.