గ్రాఫిక్స్‌లో రాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణ, అభినవ సర్దార్, అభిమన్యుసింగ్ ముఖ్య పాత్రల్లో కాలింగ్‌బెల్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పన్నారాయల్ దర్శకత్వంలో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశోక్ మంద, రాజ్‌దళవాయి, టోనీ నిర్మిస్తున్న చిత్రం ‘రాక్షసి’. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. న్యూయార్క్‌లో గ్రాఫిక్స్ వర్క్‌ను జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు పన్నారాయల్ తెలియజేస్తూ, ‘కాలింగ్‌బెల్’ చిత్రం కంటే ఎన్నో రెట్లు స్టాండర్డ్‌గా ఉండే చిత్రమిదని, న్యూయార్క్‌లో గ్రాఫిక్స్ పనులు చేయిస్తున్నామని, పూర్ణపై చిత్రీకరించిన ఓ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని, పూర్తి స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌లో నాలుగు నిమిషాల నిడివితో ఉంటుంది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చే పాట ఇదని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. మంచి చిత్రంతో సినిమా నిర్మాణంలోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, కెమెరా: కర్న పి., ఎడిటింగ్: శ్రీ సంతోష్, నిర్మాతలు: అశోక్ మంద, రాజ్‌దళవాయి, టోనీ, కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం: పన్నారాయల్.