మారిన కత్రినా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో అంతగా కనిపించడం లేదు కత్రినా కైఫ్. రణబీర్‌తో చేసిన జగ్గా జూసూస్ సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుండగా, సల్మాన్ హీరోగా నటించనున్న టైగర్ జిందా హై అనే మరో సినిమాలోనూ చేస్తోంది. ముఖ్యంగా డాన్సుల విషయంలో ఆరితేరడానికి తెగ వర్కవుట్స్ చేసేయడం.. నాట్యం కోసం బాగా కష్టపడిపోవడంతో ఈమె మరింత అందంగా కనిపిస్తోందట! తాజాగా దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో జరిగిన సరస్వతీ పూజకు చాలామంది సెలబ్రిటీలు రాగా.. వీరిలో కత్రినా కైఫ్ కూడా ఉంది. ఇక్కడ కొంచెం లావుపాటి శరీరంలో.. బరువెక్కిన శరీరంతో వున్న కత్రినాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫేస్‌లో గ్లో అంతగా తగ్గినట్లు కనిపించలేదు కానీ.. నడుం కొలతల్లో మాత్రం తేడా స్పష్టంగా తెలిసిపోయిందట. మరి ఇలా లావెక్కడం ఏదైనా పాత్ర కోసమా? లేక వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ చూపించడం మానేసిందా? అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.