16 ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో ‘్ధరువంగల్ పదినారు’ (డి 16) పేరుతో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ చిత్రాన్ని తెలుగులో ‘16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్’ పేరుతో అనువదిస్తున్నారు. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత పద్మావతి మాట్లాడుతూ- ‘తమిళంలో ఇటీవల రిలీజై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘్ధరువంగల్ పదినారు’ చిత్రాన్ని తెలుగులో ‘16-ఎవ్వరి డీటెయిల్ కౌంట్స్’ పేరుతో అనువదిస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రమిది. తమిళనాట ఇప్పటికీ చక్కని వసూళ్లతో దూసుకెళుతోంది. వాస్తవానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశ్యంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాలనుకున్నారు. కానీ పోటీలో భారీ మొత్తాన్ని చెల్లించి చేజిక్కించుకున్నాం. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు.
రెహ్మాన్ హీరోగా నటించారు. ధృవ సినిమాలో అరవిందస్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్ర ఈ చిత్రంలో హీరో పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. సుజిత్ సరంగ్ కెమెరా వర్క్, జూకేష్ బిజోయ్ సంగీతం, రీరికార్డింగ్ హైలెట్. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని రకాల అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థ్రిల్లర్ జోనర్‌లో సరికొత్త అనుభూతినిచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసి మార్చిలో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.