గ్రాఫిక్స్‌లో రాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలింగ్‌బెల్ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పన్నా రాయల్ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హారర్ ఎంటర్‌టైనర్ ‘రాక్షసి’. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్ సర్దార్, అభిమన్యుసింగ్, గీతాంజలి ముఖ్యపాత్రల్లో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్‌ను న్యూయార్క్‌లో చేస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, ఈనెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు పన్నారాయల్ మాట్లడుతూ- ‘కాలింగ్‌బెల్ కంటే టెక్నికల్‌గా ఎన్నో రెట్లు నాణ్యతతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. క్వాలిటీగా రావడం కోసం గ్రాఫిక్ వర్క్‌ను న్యూయార్క్‌లో చేయిస్తున్నాం. కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ చిత్రంలో పూర్ణపై చిత్రీకరించిన ఓ సాంగ్ తప్పక హైలైట్ అవుతుంది. నాలుగు నిముషాల నిడివి వుండే ఈ సాంగ్‌ని పూర్తిగా విజుల్ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ఇది ఈమధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాల్లో భిన్నంగా ఉంటుంది.’ అన్నారు. నిర్మాతలు అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ మాట్లాడుతూ- ‘ఒక మంచి చిత్రంతో మా బేనర్‌ను స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పన్నారాయ్ చెప్పిన కథ మాకెంతో నచ్చింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం.’అన్నారు.
పూర్ణ, అభిమన్యు సింగ్, అభినవ్ సర్దార్, గీతాంజలి, పృధ్వీ, బేబి ధ్వని, బేబీ కతిక, సమ్మెట గాంధి, తా.రమేష్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:వినోద్ యాజమాన్య, కెమెరా:కర్ణ.పి, ఎడిటింగ్:శ్రీసంతోష్, నిర్మాతలు:అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పన్నా రాయల్.