17న ఘాజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా, తాప్సీ జంటగా పి.వి.పి సినిమా మరియు మాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఘాజి’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘1970 కాలానికి సంబంధించి తెరకెక్కిన ఈ చిత్రంలో భారత్-పాకిస్తాన్ యుద్ధం ప్రధానాంశంగా సాగుతుందని, థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్‌తోపాటు టెక్నికల్ ఫొటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తోపాటుగా రానా, తాప్సిల నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద’ని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తామన్నారు. కె.కె.మీనన్, అతుల్‌కులకర్ణి, ఓంపురి, నాజర్, రాహుల్‌సింగ్, మిలింద్ గుణాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:ఎ.శ్రీకర్ ప్రసాద్, కెమెరా:మది, మాటలు: గుణ్ణం గంగరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సంకల్ప్.