త్రిష 1818

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష కథానాయికగా మైండ్ డ్రామా పతాకంపై రిథున్ సాగర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1818’. రాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. దర్శక, నిర్మాత రిథున్ సాగర్ మాట్లాడుతూ- నవంబర్ 11, 2008 ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ఇదని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తాజ్ హోటల్ సహా పలు ప్రాంతాలలో మారణకాండకు పాల్పడి అమాయక ప్రజలను, పలువురు విదేశీయుల్ని హతమార్చారని, అసలు అక్కడ ఏం జరిగిందనే కథనంతో చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. సమాచార లోపంతో ఎదురైన పరిణామాలు ఎలా వుంటాయనే పాయింట్ చిత్రంలో వుంటుందని, త్రిష హోటల్ హోస్టెస్‌గా సరికొత్త ఆహార్యంతో నటిస్తోందని, తప్పక ఈ సినిమా విజయవంతం అవుతుందని తెలిపారు. బ్రహ్మానందం, సుమన్ పాత్రలు హైలైట్‌గా వుంటాయని అన్నారు. రమేష్ తిలక్, మీరాఘోషల్ తదితరులు నటిస్తున్నారు.