ఆ కోరిక నెరవేరింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దర్శకుడు రాఘవేంద్రరావుకు హథీరామ్ బాబా కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు గురించి నాకు చెప్పారు. బాబాను నమ్మే నేను- నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో షిరిడీ సాయి తీశాను. మా కులదైవం వేంకటేశ్వరస్వామిపై సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’- అని నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి తెలిపారు. నాగార్జున కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మహేష్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ సినిమా ఈనెల 10న విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలిపారు.
కథాంశం
శ్రీవేంకటేశ్వర స్వామికి మహాభక్తుడైన హథీరామ్ బాబా పుణ్యచరిత్రే ఈ సినిమా ప్రధాన కథాంశం. వేంకటేశ్వరస్వామికి-హథీరామ్ బాబాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆ కథతోపాటుగా కృష్ణమ్మ చరిత్ర కూడా అంతర్గతంగా వుంటుంది. తిరుపతి కొండపైన హథీరామ్ బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? పూజలు, పునస్కారాలు, వెన్నతో దీపం వెలిగించడం, అక్కడ పరిపాలన ఎలా వుంటుంది? అనే అంశాలను దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు. హథీరామ్ బాబాకు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఈ సినిమాలో వుంటుంది.
మంచి అనుభవం
సినిమా షూటింగ్‌లో నేను పెద్దగా సెట్స్‌కు వెళ్లలేదు. నా స్నేహితుడు విక్రమ్ అంతా చూసుకున్నాడు. వేంకటేశ్వరస్వామి గురించి పెద్ద వయస్కులకు తెలుసు. ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కొండపై జరిగే పూజల గురించి, హథీరామ్ బాబా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. సినిమా చూశాక అనేక వేలమంది తిరుపతికి వెళ్లివస్తారని భావిస్తున్నాం. సినిమా టైటిల్ హథీరామ్ బాబా అని ఎందుకు పెట్టలేదని చాలామంది అడిగారు. వేంకటేశ్వర నామాన్ని ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుందని ‘ఓం నమో వెంకటేశాయ’ అని పెట్టాము. ఈ సినిమా రూపొందించడమే ఓ మంచి అనుభవంలా మిగిలింది.
సహజత్వానికి దగ్గరగా..
500 సంవత్సరాల క్రితం తిరుపతి ఎలా వుండేదో అలాగే అత్యంత సహజంగా షూటింగ్ చేశాం. టెక్నికల్‌గా అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. చిక్‌మగళూరులో గ్రామీణ నేపథ్యంలో దేవదేవుడే మాతో వుండి షూటింగ్ జరిపించుకున్నాడనిపిస్తుంది. వాటర్‌ఫాల్స్, చిన్న చిన్న సన్నివేశాల్లో సిజి వర్క్ వుంటుంది కానీ గ్రాఫిక్స్ వుండవు. సినిమా అంతా నాచురల్‌గానే ఉంటుంది. రీ రికార్డింగ్‌కు ముందు సినిమా చూసేత అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తుంటే కళ్లవెంబడి నీళ్లు వచ్చాయి. ఇంత అద్భుతమైన చిత్రానికి నిర్మాతనైనందుకు ఆనందంగా ఉంది.
నాగార్జున కీలకం
సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి వంటి హిట్స్ సాధించిన నాగార్జున ఈ సినిమాలో నటించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. భక్తి సినిమాలు చేయడం అందరికీ చేతనయ్యే పనికాదు. ఈ సినిమా కోసం కచ్చితమైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఆయన నిష్ఠతో పనిచేశారు. మరో సినిమా ఒప్పుకోకుండా గెడ్డం పెంచి పనిచేశారాయన. ఆయనే ఈ సినిమాకి కీలకం.
మంచి గుర్తింపు
ఈ సినిమా చేశాక ఎక్కడికి వెళ్లినా ఫలాని సినిమా నిర్మాత అని గుర్తిస్తారు. గతంలో కూడా షిరిడీ సాయి తరువాత ఎక్కడికి వెళ్లినా ఆ చిత్ర నిర్మాతగా ఆదరించారు. ఇప్పటికీ అనేక ఫోన్లు వస్తూనే వుంటాయి.
సౌరభ్ జైన్ ఎంపిక
వేంకటేశ్వరస్వామిగా చాలామందిని అనుకున్న తరువాత గోపాల్‌రెడ్డి సౌరభ్ జైన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్న ఆయన దేవుడి పాత్ర చేయనని అన్నారు. అప్పుడు నాగార్జున మూడు కమర్షియల్ హిట్స్ తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పడంతో సౌరభ్ అంగీకరించారు. వేంకటేశ్వరుడి పాత్రలో ఆయన చాలా అందంగా, అద్భుతంగా నటించాడు.
కీరవాణి ఘనత
నాగార్జున-రాఘవేంద్రరావు-కీరవాణిలది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. వారి నేతృత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. ఓ పక్క బాహుబలి-2కి పనిచేస్తూ, మరోవైపు మా సినిమాకు అద్భుతమైన పాటలను ఆయన అందించారు. భక్త్భివంతో పాటలకు బాణీలు కట్టారు.

-యు