సార్వభౌమగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ వైవిధ్యంగా వుండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే సింహ, లయన్, డిక్టేటర్ లాంటి టైటిల్స్ అన్నీ ఆయన కోసమే అన్నట్లుగా వున్నాయి. తాజాగా ‘సార్వభౌమ’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ బాలకృష్ణ కోసమే అన్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దర్శకుడు సత్యదేవా ఇప్పటికే స్టోరీని కూడా బాలయ్యకు వినిపించేశాడట! గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ తర్వాత బాలయ్య తదుపరి చిత్రమేమిటనేది ఇంకా తెలియడం లేదు. కృష్ణవంశీతో ‘రైతు’ చేస్తాడని ప్రచారం వున్నా.. అందులో అమితాబ్ పోషించే కీలక పాత్రకోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. అందువల్ల ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సత్యదేవా వినిపించిన ‘సార్వభౌమ’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని టాలీవుడ్ టాక్! ఇది సెట్స్‌పైకి వెళ్ళేదీ లేనిదీ త్వరలోనే తెలుస్తుంది.