డోసు పెంచేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ రియాచక్రవర్తి గుర్తుందా? అలా అంటే గుర్తుపట్టడం కష్టమే. కానీ సుమంత్ అశ్విన్ హీరోగా ఎమ్మెస్‌రాజు రూపొందించిన ‘తూనీగ తూనీగ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రియా అంటే అందరికీ తెలుస్తుంది. నిధి పాత్రలో నటించిన ఈమెకు ఆ సినిమా అంతగా గుర్తింపునివ్వలేదు. టాలీవుడ్‌లో సెటిలవ్వాలని కలలుగన్న రియా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఆ సినిమా తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా సినిమా అవకాశాలు రాని ఈమె మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోందట. ముఖ్యంగా ఈసారి గ్లామర్ డోస్‌ను మరింత పెంచి అవకాశాలు పట్టేయాలని చూస్తోంది. అందులో భాగంగా కొన్ని హాట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. రియా విడుదల చేసిన ఫొటోలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మరి గ్లామర్ డోస్ పెంచిన ఈమెకు తెలుగులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.