త్వరలో పద్మావతి షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి దరిమిలా నిలిచిపోయిన ‘పద్మావతి’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ చిత్రంలో రాజారతన్‌సింగ్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ విషయం వెల్లడించారు. ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా ‘షూటింగ్’ మొదలుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ‘రంగూన్’ చిత్రం కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున అంతకుమించి వివరాలు వెల్లడించనని షాహిద్ పేర్కొన్నాడు. కాగా రాణి పద్మావతిని అల్లాఉద్దీన్ ఖిల్జీ ప్రేమించినట్లు కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఇది రాజపుట్‌లను అవమానిస్తున్నట్లేనని, చిత్రం పేరును, వక్రీకరణను నిలిపివేయాలంటూ రాజపుట్ కర్ణిసేన ఆధ్వర్యంలో సెట్‌లోనే దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి జరగడంతో షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని సినీరాజకీయ వర్గాలు ఖండించాయి. నిజానికి ఇది కల్పిత కథ అని, ఇందులో పేర్కొన్న అల్లాఉద్దీన్ ఖిల్జీ మొఘల్ రాజు కాదని, రాజపుత్రులను కించపరిచే సన్నివేశాలేమీ లేవని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో షాహిద్ ఈ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో రాణి పద్మావతిగా దీపికా పదుకొనె, అల్లాఉద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సిగ్ నటిస్తున్నారు.