శింబు సరసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై పాండీరాజ్ దర్శకత్వంలో శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాదం సిద్ధమైంది. తమిళంలో వేసవి కానుకగా విడుదలైన ఈ చిత్రం విజయవంతమైంది. తెలుగులో విడుదల కావలసి వున్నా డిమానిటైజేషన్ కారణంగా వాయిదా పడింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ- ఐటి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథగా రూపొందించిన ఈ చిత్రంలో మాటలు, పాటలు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. ఐటి రంగంలో పనిచేసే యువతీ యువకులు ఎలా ప్రేమిస్తున్నారు? ఎలా విడిపోతున్నారు? వారి పెళ్లి చివరిదాకా వస్తుందా అనే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన అన్నారు. సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్, సంగీతం:కురళ్ అరసన్, కెమెరా:బాలసుబ్రహ్మణ్యం, ఎడిటింగ్:ప్రవీణ్‌ప్రదీప్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండీరాజ్.