సెకండ్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అందాల భామ భూమిక. అందరూ స్టార్ హీరోలతో నటించి లక్కీ చార్మ్‌గా పాపులరైన భూమిక ఆ తరువాత భరత్ ఠాకూర్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. పెళ్లిచేసుకున్నాక కూడా అడపాదడపా సినిమాలు చేస్తూన్న ఈమె, ‘ఎం.ఎస్.్ధని’ చిత్రంలో ధోని అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. చాలాకాలం తరువాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది ఈమె. తాజాగా నేను లోకల్ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న నాని నటించే తదుపరి చిత్రంలో భూమిక అక్క పాత్రలో కనిపించనుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో భూమిక పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుందని, అందుకే ఈ పాత్ర కోసం ఆమెను అడిగారట. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో భూమిక ఓకె చెప్పినట్టు తెలిసింది. టాలీవుడ్‌లో ముఖ్యంగా మహేష్, పవన్‌కళ్యాణ్‌లాంటి హీరోలకు కెరీర్ బెస్ట్ సినిమాల్లో హీరోయిన్‌గా భూమిక వుండడం విశేషం. అంతేకాదు, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో కూడా భూమిక హీరోయిన్‌గా నటించింది. భూమిక హీరోయిన్‌గా వుంటే చాలు, ఆ సినిమా హిట్ గ్యారంటీ అనే స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుంది. అందానికి అందం, ఆకట్టుకునే నటనతో సాగిన భూమిక కెరీర్ ఆ తరువాత గ్లామర్ గర్ల్‌గా కూడా అంతే ఇమేజ్‌ను తెచ్చుకుంది. మరి ఈ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భూమిక ఈ తరహా పాత్రలతో సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి!