మార్చి 3న చిత్రాంగద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలో రూపొందిస్తున్న చిత్రం చిత్రాంగద. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా, క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకాలపై అశోక్.జి. దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఒక్కో పాటను ఒక్కో లైవ్ షో ద్వారా విడుదల చేస్తూ ఆడియోను వినూత్న పద్ధతిలో అందిస్తున్నామని, మార్చి 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఎవరూ చెప్పని ఓ సరికొత్త కథనంతో హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌గా, ఆసక్తికరంగా, ఉత్కంఠతో సాగుతుందని తెలిపారు. సినిమాలో వుండే ట్విస్టులు ఆడియన్స్‌కు సరికొత్తగా వుంటాయని, కొన్ని అదృశ్య శక్తుల కారణంగా కథానాయిక జీవితం చిక్కుల్లో పడితే, ఆ సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగద ఏం చేసింది అనేదే ఈ సినిమా కథ అని తెలిపారు. కథానుగుణంగా అమెరికాలోని పలు లొకేషన్‌లలో కీలక ఘట్టాలు చిత్రీకరించామని, ఊహించని మలుపులతో ఈ సినిమా సాగుతుందని వారు తెలిపారు. జె.పి, సప్తగిరి, రాజా రవీంద్ర, సింధు తులాని, రక్ష, దీపక్, సాక్షిగులాటి, సుధీర్, జ్యోతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సెల్వ గణేష్, స్వామినాధన్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అశోక్.జి.