నమ్రత రీఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు భార్య, ఒకప్పటి మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ మళ్లీ సినిమాల్లో నటించనున్నారు. 2005లో ‘బ్రైడ్ అండ్ ప్రిజుడీస్’ అనే ఆంగ్ల సినిమాలో నటించిన ఆమె, ఆ తరువాత ఏ చిత్రంలో నటించలేదు. ఇన్నాళ్లూ భర్త మహేష్‌బాబుకు సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార విషయాలు, కుటుంబ పరమైన విషయాలను చూసుకుంటూ వచ్చిన ఆమె ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. కానీ ఆ సినిమా ఎవరిది? ఏ భాషలో రూపొందుతోంది, ఎవరెవరు నటిస్తున్నారు? ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? లాంటి వివరాలన్నీ ఆమె తెలుపలేదు. దీంతో అందరిలోనూ ఆమె నటిస్తున్న ప్రాజెక్టు ఏమిటి అనే ఆసక్తి అటు టాలీవుడ్‌లోనూ ఇటు బాలీవుడ్‌లోనూ నెలకొంది.