సెట్స్‌పైకి ప్రభాస్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ఈ సినిమా కోసం తన మూడేళ్ల కెరీర్‌ను పణంగా పెట్టాడు. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్, తన తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టాడు. ఆయన నెక్స్ట్ సినిమా సుజిత్ దర్శకత్వంలో వుంటుందని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా తెలిపాడు. ‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజిత్, ప్రభాస్ చిత్రం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే సమయం వచ్చేసింది. ఈ చిత్రాన్ని 13న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని సమాచారం. ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ జరుపుతారని, ప్రస్తుతం ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. ఇన్నాళ్లు ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది గుడ్‌న్యూసే. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెల్లడిస్తారు.