పోలీస్‌గా రాశీఖన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటింన ‘మన్యం పులి, ఒప్పం’ వంటి సినిమాలు మలయాళంలోనే కాక తెలుగు, తమిళంలో సైతం సూపర్‌హిట్లవడంతో ఆయన సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ తరుణంలో ఆయన తన సినిమాల్లోకి ఇతర భాషా నటీనటుల్ని కూడా తీసుకుంటూ ఆ క్రేజ్‌ను మరింతగా పెంచుతున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్ పూర్తిచేసిన ‘1971 బియాండ్ బోర్డర్స్’ చిత్రంలో తెలుగు హీరో అల్లు శిరీష్‌కు ఛాన్స్ ఇవ్వగా తన తరువాతి చిత్రంలో కూడా వేరే తెలుగు నటీనటులకు అవకాశమిచ్చారు. ప్రస్తుతం ఆయన బి.ఉన్నికృష్ణన్ చేస్తున్న ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్ హన్సిలకు మంచి రోల్స్ ఇవ్వగా, మరొక తెలుగు స్టార్ హీరోయిన్ రాశిఖన్నా కూడా ఈ ప్రాజెక్టులో నటించనుంది. ఇందులో ఈమె ఒక టాప్ పోలీస్
ఆఫీసర్‌గా కొత్త గెటప్‌లో కనిపించనుంది. దీంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఈ చిత్రంపట్ల మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఫిబ్రవరి నెలాఖరునుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాని
మలయాళంలో పాటు ఈ రెండు భాషల్లో కూడా నేరుగా రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.