భారీ బడ్జెట్ చిత్రంలో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పవన్‌కల్యాణ్ సరసన ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు కమల్‌హాసన్ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ సినిమాలో మాత్రమే నటిస్తోంది. తండ్రి సినిమా కోసం వేరే సినిమాల కమిట్‌మెంట్స్ ఏవీ పెట్టుకోని ఈ అమ్మడు ఆ సినిమా పూర్తవడంతో ఇప్పుడు స్పీడ్ పెంచింది. లేటెస్టుగా ఓ భారీ బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. బాహుబలి స్ఫూర్తితో భారీ సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు దర్శకుడు సుందర్.సి. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ తానందాల బ్యానర్‌పై తెరకెక్కే ఈ సినిమాకోసం మొదట్లో మహేష్, విజయ్ లాంటి హీరోలను అడిగాడు. వారిద్దరూ వేరే సినిమాల బిజీవల్ల నో చెప్పడంతో ఈ సినిమాలో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని, కథ నచ్చడంతో సినిమా చేయడానికి శ్రుతి ఓకే చెప్పినట్లు సమాచారం.