చంద్రుడిలో కుందేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సిద్ధి సెవెన్‌హిల్స్ పతాకంపై అర్జున్, క్రాంతిచంద్, అవితేజ్, కోయల్‌దాస్, ప్రదీప్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధనశ్రీనివాస్ జామి, లక్ష్మీవెంకటరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుందని, ప్రేమకు కుందేలుకు వున్న సంబంధం ఏంటి? వారిద్దరూ చంద్రుడితో ఏర్పర్చుకున్న అనుబంధం ఏమిటి అన్న పాయింట్‌తో ఈ చిత్రం యువతీ యువకులకు నచ్చే విధంగా రూపొందించామని, ప్రేమికులతోపాటు ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, రంగనాధ్, రాజీవ్ కనకాల, సప్తగిరి, షకలక శంకర్, తా.రమేష్, కాదంబరి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, పాటలు:శ్రీమణి, కరుణాకర్, సంగీతం:విజయ్ గొర్తి, కెమెరా:దామూ నర్రావుల, దర్శకత్వం:వెంకటరెడ్డి ఉసిరిక.