రాకేష్‌శర్మగా అమీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పీకే’, ‘దంగల్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ సూపర్‌హిట్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు అమీర్‌ఖాన్. మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కి గతేడాది విడుదలైన ‘దంగల్’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో అమీర్ మరో బయోపిక్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యోమగామి రాకేష్ శర్మగా అమీర్ కనిపించబోతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు. ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రాంలో భాగంగా 1984 ఏప్రిల్ 2న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ హోదాలో రాకేష్ శర్మ సోయజ్ టి 11లో అంతరిక్షంలో ప్రయాణించారు. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్లాక అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీతో కూడా మాట్లాడారు. అంతరిక్షం నుంచి భారత్‌ను చూస్తే ఎలా వుంది అని ఇందిర అడగ్గా... ‘సారే జహాసే అచ్ఛా’ అని సమాధానం ఇచ్చి దేశభక్తిని చాటుకున్నారు. అంతరిక్షంలో భారత జెండాను రెపరెపలాడించిన రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ సినిమాను తెరకెక్కించాలని భావించారు. స్క్రిప్ట్‌ని కూడా అమీర్‌కి నేరేట్ చేయగా అది బాగా నచ్చిందట. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి ‘సెల్యూట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌కె పిల్మ్స్ పతాకంపై నిర్మించబోతున్నారు. 2018లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. మహేష్ మథారు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. రాకేష్ శర్మకు మన హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. 1949 జనవరి 13న జన్మించిన రాకేష్ హైదరాబాద్‌లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ హైస్కూల్‌లో, నిజాం కాలేజీలో చదువుకున్నారు. 1966లో ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్ అయ్యారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, అట్నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోల్స్‌లో పైలట్‌గా వెళ్లారు. ప్రస్తుతం అమీర్ ‘్థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రంలో నటిస్తున్నారు.