ఆ యోధులే నిజమైన హీరోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న భారత వీరులు నిజంగా హీరోలని నటుడు రానా అన్నారు. ఈనెల 17న ఘాజీ ఎటాక్ చిత్రం విడుదల సందర్భంగా ఆయన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాల్లో ఆసక్తికర అంశాలను రానా ప్రస్తావించారు.
‘1971లో భారత జలాంతర్గామిలోని సిబ్బందికి, పాకిస్తాన్‌కి చెందిన జలాంతర్గామి ఘాజీకి మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో నేను కథానాయకుడిగా నటించిన ఘాజీ సినిమా ఈనెల 17న విడుదలవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా అప్పట్లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారులను నేను కలిశాను. యుద్ధంలో వారు ఎదుర్కొన్న అనేక సవాళ్లను తెలుసుకున్నాను. వారి ధైర్యానికి, దేశభక్తికి చలించిపోయాను. ఈ సినిమా విడుదల నేపథ్యంలో అలాంటి యోధుల కృషిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను’ అని నటుడు రానా భారతదేశ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఓ లేఖ రాశారు. తాను ఈ చిత్రంలో లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మగా నటించానని, ఘాజీ సినిమా విడుదలైన తరువాత సరిహద్దు భద్రత కోసం పోరాడుతున్న సైనికులు సాధించిన విజయం గురించి ఎందరో పౌరులు తెలుసుకుంటారని, ఓ సామాన్య పౌరుడినైన తనకు యుద్ధాల గురించి తెలియకపోయినా ఇలాంటి వాస్తవాలు విని నిజమైన హీరోలను గుర్తించానని, వారే దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే జవానులని ఆయన అన్నారు. వారి గురించి మరెన్నో విషయాలు దేశ పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం వుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తొలిసారిగా జలాంతర్గామి నేపథ్యంలో భారతదేశంలో విడుదలవుతున్న తొలి సినిమాగా ఇప్పటికే ఘాజీ విశేషమైన గుర్తింపు పొందింది.