మార్చిలో కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టర్ పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కలయికలో కొన్ని రోజుల క్రితం ఒక సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరి గత సినిమాలు జాల్సా, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు భారీ విజయాలుగా నిలవడంతో ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠతో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్, నటీనటుల ఎంపిక వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ మార్చి 14 నుండి మొదలవుతుందట. ఇప్పటికే చేస్తున్న ‘కాటమరాయుడు’ షూట్ పూర్తవగానే కాస్త గ్యాప్ తీసుకుని 14 నుండి రెగ్యులర్ షూట్‌లో పాల్గొంటాడట పవన్. ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లు నటించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.