పాటల్లో ఓ పిల్లా నీవల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేష్ రాధోడ్, మోనికాసింగ్, షాలు చౌరాసియా ప్రధాన తారాగణంగా కిశోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న ‘ఓ పిల్లా నీవల్లా’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సీడిని విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- పాటలు బాగున్నాయి, తప్పకుండా సినిమా విజయం సాధించాలి అన్నారు. మరో నిర్మాత రాజ్ కం దుకూరి మాట్లాడుతూ- టైటిల్ బాగుంది. మధుపొన్నా చక్కని సంగీతం అందించాడు. మెలోడీతోపాటు మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. కిశోర్ నాకు బాగా తెలుసు. మం చి ప్యాషన్ వున్న వ్యక్తి. తప్పకుండా ఈ సినిమా అతనికి మంచి పేరు తేవాలి అన్నారు. లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడు తూ- సాధారణంగా అమ్మాయిలవల్ల అబ్బాయిల జీవితాలు మారిపోతాయని మనం వింటుంటాం. మరి ఈ సినిమాలో అమ్మాయివల్ల ఏం జరిగిందో చెబుతున్నారు. తప్పకుండా యూత్‌కి నచ్చే సినిమా ఇది. తప్పకుండా దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని తీసిన కిశోర్‌కు మంచి విజయం దక్కాలి అన్నారు. మోనికా రాధోడ్ మాట్లాడుతూ- దర్శకుడు కిశోర్ మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో మా ప్రయతాన్ని అభినందిస్తారని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో లోహిత్ కుమార్, సుధీర్‌రెడ్డితోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.