అద్భుతాన్ని ఆవిష్కరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, హథీరామ్‌బాబా జీవిత కథతో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో కేంద్ర మంత్రివర్యులు ఎం.వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- నిజంగా ఓ అద్భుతమైన చిత్రాన్ని చూశాననే భావన కలిగింది. రాఘవేంద్రరావు-నాగార్జునలు కలిసి ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాఘవేంద్రుడి సృజనాశక్తి అద్భుతం. కమనీయంగా, రమణీయంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా నాటి చరిత్రను నేటి తరానికి అందించారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మహేష్‌రెడ్డిని అభినందిస్తున్నాను. ఏడు కొండలు వెనుక వున్న కథను చక్కగా క్రోడీకరించి అందంగా మలిచారు. ప్రస్తుతం ఆధునిక యుగంలో భక్త్భివం తగ్గిపోతోంది. ముఖ్యంగా జీవన ప్రమాణంలో వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి భక్త్భివం పెంచే సినిమాలు మరిన్ని రావాలి. ముఖ్యంగా నాగార్జున ఈమధ్య వరుసగా భక్తి సినిమాలతో అలరిస్తున్నాడు. నిజానికి ఆయనకున్న ఇమేజ్ వేరు. ఈ చిత్రంలో హాథీరామ్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. కలియుగ వైకుంఠం అంటే ఏమిటో అద్భుతంగా చూపించాడు. ఈ చిత్రాన్ని చూస్తుంటే అప్పట్లో ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా గుర్తుకొచ్చింది. వెంకటేశ్వరస్వామిని బాలాజీ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూస్తే తెలిసింది. అనుష్క, సౌరభ్‌జైన్, ప్రగ్యాజైస్వాల్ చక్కగా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం యువత ఇలాంటి చిత్రాల్ని తప్పకుండా చూడాలి. ఆధ్యాత్మిక సంపద ముఖ్యమైంది. దానివల్ల ఎంతో వికాసం కలుగుతుంది. మన దేశంలో ఉన్నంత ప్రాచీన సంపద ఎక్కడా లేదు. ఇలాంటి చరిత్రలతో నేటి తరానికి తెలియజెప్పడానికి ప్రయత్నించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, రాఘవేంద్రరావు, జె.కె.్భరవి, నిర్మాత మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.