కలర్స్ స్వాతి మళ్లీ వస్తోంది?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 February 2017
‘అష్టాచెమ్మ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన స్వాతి ఆ చిత్రంతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్, నంది అవార్డులను గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించి వరుస ఛాన్సులు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలతో ఒక వెలుగువెలిగిన స్వాతి 2015లో వచ్చిన ‘త్రిపుర’ చిత్రం పరాజయంతో బాగా వెనుకబడ్డారు. ఆ చిత్రం విడుదలై సంవత్సరంపైనే అవుతున్నా ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు. తాజాగా స్వాతి తెలుగులో ఒక సినిమాకి సైన్ చేసిందట. నూతన దర్శకుడు ఆదిత్య డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో స్వాతి ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో కలిసి నటించనుందట. ఈ చిత్రం పూర్తిగా లవ్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని అంటున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.