భయమెరుగని యుద్ధనారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ తొలి స్టంట్ విమెన్ మేరి ఇవాన్స్ కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు ఆద్యురాలు
‘్ఫయర్‌లెస్ నదియా’గా పేరుప్రఖ్యాతలు ఆమె జీవితకథ నేపథ్యంతో ‘రంగూన్’?
కోర్టు వివాదం నడుమ రేపు విడుదల

ఆమెకు యుద్ధం సరదా కాదు..
బతకాలంటే యుద్ధం చేయక తప్పలేదు..
అది ‘కళ’గా..వృత్తిగా, తృప్తిగా
జీవించడానికి ఉపయోగపడింది.
ఎక్కడో పుట్టి ఇక్కడ పెరిగి
తనకంటూ మరెవరికీ దక్కని ఇమేజ్‌తో ఓ వెలుగువెలిగింది.
ఆమె పేరు మేరీ అన్ ఇవాన్స్. అసలు పేరు ఇదే అయినా.. ఎక్కువమందికి తెలిసిన పేరు ‘్ఫయర్‌లెస్ నదియా’. బాలీవుడ్‌లో తొలి సహజమైన స్టంట్‌విమన్. హిందీ చిత్రరంగంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె ప్రాణం. ఎన్నో చిత్రాలలో ఆమె కథానాయిక. ఆ తరహా చిత్రాలలో ఓ మెరుపుమెరిసిన తార. తొలిచిత్రంలో బానిస యువతిగా రెండో చిత్రంలో యువరాణిగా నటించి మెప్పించిన తార. సాహసానికి, యుద్ధవిద్యలో నైపుణ్యానికి, నటనలో ప్రజ్ఞకు ఆమె ఓ ఉదాహరణ. అయితే ఆమె జీవితం నల్లేరుపై నడకలా సాగలేదు. ఎన్నో కష్టనష్టాలను అనుభవించింది. కష్టానికి తగ్గ్ఫలితం సాధించింది. ఎనలేని కీర్తిప్రతిష్టలతో జీవితం చాలించింది.
ఆస్ట్రేలియాలో పుట్టినా...
స్కాట్లాండ్‌కు చెందిన హెల్బర్ట్ ఇవాన్, గ్రీక్ మహిళ మార్గరెట్‌ల గారాలపట్టి మేరి ఇవాన్స్. బ్రిటిష్ ఆర్మీలో వలంటీర్‌గా పనిచేసే హెల్బర్ట్ తొలి ప్రపంచయుద్ధ సమయంలో పెషావర్‌కు కుటుంబ సమేతంగా తన రెజిమెంట్‌తో కలసి రావలసి వచ్చింది. అప్పుడు ఇవాన్ వయస్సు ఏడాది. ఆరేళ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబం కష్టాలపాలైంది. 1928లో కుమార్తెను తీసుకుని తల్లి ముంబై చేరుకుంది. ఆర్మీ, నేవీ స్టోర్‌లో పనికి కుదిరింది. తల్లి ప్రోద్బలంతో మేడమ్ అస్త్రోవ్ వద్ద నటన, నృత్యవిన్యాసాలు, యుద్ధకళలు నేర్చుకుంది. ఆ తరువాత 1930లో జర్కో సర్కస్ కంపెనీలో చేరింది. గుర్రపుస్వారీ, ఇతర యుద్ధకళల్లో నైపుణ్యం సాధించింది. దేశమంతటా తిరుగుతూ అటు సర్కస్‌లో పనిచేస్తూ, ఇటు నాటకాలు వేసింది. అందమైన కురులు, నీలికళ్లు ఆమెకు వరంగా మారాయి. ఓసారి ఆర్మేనియన్ జ్యోతిష్కుడు ఆమెను చూసి పేరులో మొదటి అక్షరం ‘ఎన్’ ఉంటే ఇక ఎదురే ఉండదని చెప్పడంతో ‘నదియా’గా పేరుమార్చుకుంది ఇవాన్స్. ఆ తరువాత ఆమె దశ తిరిగింది. అప్పటికే ఆమె నటనాచాతుర్యం, ఫైట్స్, ఫీట్స్‌లో ప్రజ్ఞ లోకానికి తెలిసింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వాడియా మూవీటోన్ అధినేత జంషెడ్ జెబిహెచ్ వాడియా ఆమెకు అండగా నిలిచాడు. తొలిచిత్రం ‘దేశ్‌దీపక్’లో బానిసగా అవకాశం ఇచ్చారు. ‘నూర్ ఇ యమన్’లో యువరాణిగా నటించింది. హంటర్‌వాలీ-విమెన్ విత్ విప్ (1935)లో ఆమె నటన ఓ సంచలనం. ఆ తరువాత 1943లో దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. దాదాపు 55 సినిమాల్లో ఆమె నటిస్తే వాటిలో ఎక్కువ హీరోయిన్‌దే లీడ్ రోల్. ఆమెకు పేరు, బాక్సాఫీస్ వద్ద కాసులు తెచ్చిపెట్టిన సినిమాల్లో ‘టైగ్రెస్’, ‘స్టంట్‌క్వీన్’, ‘డైమండ్ క్వీన్’, ‘వౌజు’, ‘జంగిల్ ప్రినె్సస్’, ‘లేడీ రాబిన్‌హుడ్’ వంటివి ఉన్నాయి. హిందీలో తొలి జేమ్స్‌బాండ్ తరహా చిత్రం ‘ఖిలాడి’లో ఆమె నటించారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన జంషెడ్ చిన్న సోదరుడు ‘హోమి’ని వివాహం చేసుకున్న నదియా 1965 తరువాత సినిమాలకు స్వస్తిచెప్పారు. అనంతరం తనకు ఇష్టమైన గుర్రాల పెంపకంతో గడిపారు. మేలుజాతి ‘త్రూబ్రెడ్’ గుర్రాలంటే ఆమెకు ఇష్టం. 1908 జనవరి 8న పుట్టిన ఆమె సరిగ్గా 88వ పుట్టినరోజు జరుపుకున్న మర్నాడే కన్నుమూసింది. కొద్ది సంవత్సరాల క్రితం మునిముని మనవడు రియాద్ విన్సి వాడియా ఆమెపై ఓ డాక్యుమెంటరీ తీశారు. అదెంతో ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఆమె జీవితకథ నేపథ్యంలో ‘రంగూన్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
-ఎస్‌కెఆర్

చిత్రం... హంటర్‌వాలీలో మేరీ ఇవాన్స్